7 May, 2026 | 3:08 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం

07-05-2026 02:07 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాలకు నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కు మార్ గౌడ్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డితో సంప్రదించి, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనీ మండల/పట్టణ అధ్యక్షుల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు తక్షణమే అమలు చెయ్యాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించారు. 

మండల నూతన అధ్యక్షులు 

బెల్లంపల్లి పట్టణ  కాంగ్రెస్ అధ్యక్షుడిగా బండి ప్రభాకర్, మండల అధ్యక్షుడిగా  దుర్గం రాజయ్య, తాండూర్ మండల అధ్యక్షుడిగా పెద్దబోయిన శంకర్, భీమిని మండల అధ్యక్షుడిగా మదారి కొమురయ్య, కన్నెపల్లి మండల అధ్యక్షుడిగా  ఏల్పుల మల్లేష్, వేమనపల్లి మండల అధ్యక్షుడిగా గాలి మధు, కాసిపేట మండల అధ్యక్షుడిగా  పనాల మహేష్ లను నియమించారు. కష్టపడి కృషి చేస్తూ, క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి  సర్వశక్తులను ఒడ్డి, కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేస్తారని మనస్ఫూర్తిగా  విశ్వసిస్తున్నట్టు ఆ ప్రకటనలో టీపీసీసీ ఛీప్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.