కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్
07-05-2026 02:05 PM
నేటితో ముగిసిన పాలకవర్గం పదవీకాలం..
షాద్‌నగర్ మే 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి టీకే శ్రీదేవి (ఐఏఎస్) ప్రత్యేక అధికారులను నియమించింది. కొత్తూరు మున్సిపాలిటీకి సిడిఏంఏ జాయింట్ డైరెక్టర్ పి.శ్రీధర్ ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఈ మున్సిపాలిటీలు కొనసాగుతాయి.






