బీజేపీ ప్రధాన కార్యదర్శిగా "ఖమ్మం" నియామకం
11-07-2026 04:24 PM
కోహెడ,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ కు చెందిన ఖమ్మం వెంకటేశం సిద్దిపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గా నియమితులైయారు. గత ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో కోహెడ మండలం అధ్యక్షులుగా వరుసగా మూడు సార్లుగా కొనసాగారు. సిద్దిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్ గా గతంలో పనిచేశారు. కాగా తన నియమానికి సహకరించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం మరింతగా కృషి చేస్తానని పేర్కొన్నారు.






