11 July, 2026 | 6:30 PM

విజయ హై స్కూల్ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికలు

11-07-2026 05:48 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికలు నిర్మల్ పట్టణంలోని విజయ ఉన్నత పాఠశాల ఆవరణలో బ్యాలెట్ బాక్స్ ఉపయోగించకుండా అత్యాధునిక సాంకేతికతతో  EVM (Electronic Voting Machine) ద్వార  ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని నూతన స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి  ఎంఈ ఓ పద్మ,  పాఠశాల జనరల్ సెక్రటరీ అయ్యన్న గారి భూమయ్య మాట్లాడుతూ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ప్రజలకు కల్పించినటువంటి ఓటు హక్కును అందరూ వినియోగించుకొని, సరైన నాయకున్ని ఎన్నుకొని, మన దేశాన్ని దర్మాన్ని ప్రజాస్వామ్యాన్ని   కాపాడాలని కోరారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన పౌరసత్వం, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేందుకు ఇటువంటి ఎన్నికలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఆడెపు సుధాకర్, సీరమ్ ప్రతాప్ రెడ్డి,కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణం,ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొన్నారు.