6 May, 2026 | 11:54 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

పార్లమెంట్ ఇంచార్జిల నియామకం

30-06-2025 01:40 AM

కరీంనగర్, జూన్ 29 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను నియమించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే దిశగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల టీపీసీసీకి ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శులుగా నియామకమైన వారిని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జిలుగా నియమించారు.

కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి వరంగల్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డిని ఇంచా ర్జీగా నియమించారు. ఆయన కింద టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహ్మద్ ఖాజా ఫక్రుద్దీన్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, అదాం రాజ్ దేకపతిలను ఇంచార్జిలుగా నియమించారు. అలాగే పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ ను నియమించారు.

ఆయన కింద ప్రధాన కార్యదర్శులు మల్లాది రాంరెడ్డి, రాజేశ్ కాశిపాక, రహ్మత్ హుస్సేన్లను నియమించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీగా నాయిని రాజేందర్ రెడ్డిని నియమించడం పట్ల సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేయడంతోపాటు రాజేందర్ రెడ్డికి శుభాకాంక్షలుతెలిపారు.