calender_icon.png 8 December, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్టీయూ మంథని మండల అధ్యక్ష కార్యదర్శుల నియామకం

08-12-2025 07:53:20 PM

మంథని,(విజయక్రాంతి): తెలంగాణా రాష్ట్ర పీఆర్టీయూ మంథని మండల అధ్యక్షులుగా ఎగ్గడి సురేష్ ను  ప్రధాన కార్యదర్శిగా పచ్చిక స్వరూపను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గండు కృష్ణమూర్తి పత్రికా ముఖంగా  తెలియచేశారు. వీరి నియామకం తక్షణమే అమలు లోకి వస్తదని అయన తెలిపారు. వీరి నియామకం పట్ల మండలశాఖ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమను అధ్యక్ష కార్యదర్శులుగా నియమించిన జిల్లా అధ్యక్షులు గండు కృష్ణ మూర్తికి,  ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పిఆర్ టియూ  సంఘ నియమా నిబంధనలను గౌరవిస్తూ జిల్లాశాఖ ఆదేశించిన కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని నూతన అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.