10 March, 2026 | 6:59 PM

మహిళా సంఘాల పాత బకాయిలు వసూలు

10-03-2026 05:32 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఐకెపి ద్వారా తీసుకున్నటువంటి లోన్లు,శ్రీనిధి పాత బకాయిలు  క్లస్టర్లలో గల వివిధ గ్రామాల్లో రికవరీ టీం వసులు చేయడం జరిగిందని మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల ఇంచార్జ్ ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ.... చిన్న లోన్లు కట్టి పెద్ద లోన్లను తీసుకోవాలని నినాదంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రికవరీ స్పెషల్ డ్రైవ్ 7వ రోజు కొనసాగుతుందని మండలంలో మొండి బకాయిలు ఉన్నవారు కట్టాలన్నారు.

మంగళవారం మండలంలోని తాండూర్, విజయసాయి, వాడి, మాటూర్, ధర్మారెడ్డి, వదలపర్తి, జలార్పూర్  గ్రామాలలో రికవరీ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు. తాండూర్ గ్రామ సంఘంలో 18,030/- విజయసాయి 8,400/-వాడి 30,000/-మాటూర్ 10,000/- ధర్మారెడ్డి 12000/- వదలపర్తి 10,000/-జలాల్పూర్ 56,000/- గ్రామాలలో కలిపి 1,44,430 మొండి బకాయిలు వసూలు చేసినట్లు ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఏపీడి విజయలక్ష్మి, డిపిఎం రాజయ్య, ఏపిఎం రామ్ నారాయణ గౌడ్, సీసీలు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.