08-12-2025 07:52:26 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసాంఘిక మెసేజ్ లు గ్రూపులో వస్తే అడ్మిన్‌లే బాధ్యత వహించాలి..
అడ్మిన్లను హెచ్చరించిన ముత్తారం ఎస్ఐ రవికుమార్..
ముత్తారం (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ దృశ్య అడ్మిన్లు తమ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ యాక్సెస్ కేవలం అడ్మిన్లకి మాత్రమే ఉండేలా చూసుకోగలరని ముత్తారం ఎస్ఐ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లేనియెడల ఏమైనా అసాంఘిక మెసేజ్ లు మీ గ్రూప్ లలో సర్కులేట్ అయినచో గ్రూపు అడ్మిన్‌లే బాధ్యత వహిస్తారని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని ఎస్ఐ హెచ్చరించారు.