10 March, 2026 | 6:59 PM

ఇంటర్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి

10-03-2026 05:39 PM

జిల్లా కలెక్టర్ హరిత 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. మంగళవారం కౌటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరిక్ష కేంద్ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష తీరును పరిశీలించి ఎంత మంది విద్యార్దులు పరీక్షలకు గైర్హజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండ ప్రశాంతంగా  పరీక్షలు జరిగేల చర్యలు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రతల దృష్ట్యా పరీక్ష కేంద్రం వద్ద త్రాగు నీరు, ఓ, ఆర్, ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.