calender_icon.png 2 November, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతృ మరణాలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి

30-10-2025 12:25:57 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట.అక్టోబర్,29(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లాలో మాతృ మరణాల సంఖ్యను తగ్గించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు అవసరమైన జాగ్రత్త చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ని వీసీ హాల్ లో జరిగిన మాతృ మరణాల సమీక్షా సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. జిల్లాలోని గుండు మల్, దామరగిద్ద, కోటకొండ, ధన్వాడ, నారాయణపేట అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో సంభవించిన 8 మాతృ మరణాల గురించి ఆయా కేంద్రాల వైద్యాధికారులు క్లుప్తంగా వివరించారు.

ఆయా మరణాలపై కలెక్టర్ వివరణ కోరారు. మాతృ మరణాల సంఖ్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై  వైద్య అధికారులతో చర్చించారు. ఇక ముందు మాతృ మరణాల నివారణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణీల ఆరోగ్యంపై ఆశా కార్యకర్తలు, ఏ ఎన్ ఎం లు, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.ఇకపై ప్రతీ మూడు నెలలకు సమావేశం నిర్వహించాలని, కలెక్టర్ సూచించారు.

అయితే ప్రసూతి మరణ నివేదిక అనేది ప్రసూ తి మరణ సమీక్షనుండి వచ్చే గోప్య పత్రం, ఇది మరణం చుట్టూ ఉన్న పరిస్థితులను విశ్లేషిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్ తెలిపారు.ఇది మరణానికి గల కారణాలను మరియు భవిష్యత్తులో ప్రసూతి మరణాలను నివారించడానికి నేర్చుకున్న పా ఠాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అందరం సమిష్టిగా, సమన్వయంతో పని చేసి జిల్లాలో మాతృ మరణాలను పూర్తిగా తగ్గించేందుకు కృషి చే ద్దామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కే. మల్లికార్జున్, ఐ.ఎం.ఏ. జిల్లా చైర్మన్ డా. మల్లికార్జున్, డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శైలజ, పీవో ఎం హెచ్ ఎన్ డాక్టర్ సుధేష్ణ, డీ జీ వో హెచ్ ఓ డీ డాక్టర్ అమిత కుమారి,అనస్థటిస్ట్ డాక్టర్ తేజస్విని,G. ఎం పీ హెచ్ ఈ వో గోవిందరాజు, 108 కో-ఆర్డినేటర్ రాఘవేందర్, సూపర్ వైజర్ నర్మద, నర్సింగ్ అధికారిని, ఆయా పీ హెచ్ సీ ల వైద్యులు,కార్యకర్తలుపాల్గొన్నారు.