30-10-2025 12:25:01 AM
అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 29 ( విజయక్రాంతి ): బారీ వర్షాల నేపథ్యంలో బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలో చేపట్టాల్సిన చర్యల గురించి అదనపు కలెక్టర్ లు,రెవిన్యూ,ఆర్డీ వో, పోలీస్, ఇరిగేషన్, ఈ ఈ ఆర్ అండ్ బి, ఫైర్,మున్సిపల్ కమిషనర్ లు, తాసిల్దార్లు ఎంపీడీవోలు అన్ని శాఖలకు చెందిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా వర్షాల నేపథ్యంలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...రాబోవు రెండు , మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందువలన ప్రతి గ్రామంలో ప్రజలు ఎవ్వరు కూడా అనవసరంగా బయట రావద్దని ,ప్రయాణాలు చేయవద్దని, శిదిలావస్థ ఇండ్లలో నివసించకూడదని తెలిపారు. మూసి పరివాహక ప్రాంతాలలో మూసి నదిలోనికి చేపలు పట్టడానికి , పశువులను కానీ ఎవ్వరిని పోనివ్వొద్దని సూచించారు. చౌట్టుపల్ చెరువును కలెక్టర్ పరిశీలించారు ఎఫ్డిఎల్ పరిధిలో చెరువు చుట్టూ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో తిరిగి పరిశీలించారు.