12 June, 2026 | 2:35 AM

ముమ్మరంగా ‘బడిబాట’ ఇంటింటి ప్రచారం

12-06-2026 01:39 AM

నేరేడుచర్ల, జూన్ 11: ఆచార్య జయశంక ర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సూ ర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ల నేరేడుచర్ల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు నేతృత్వంలో ఉపాధ్యాయ బృందం పురపాలక పరిధిలోని ఇంటింటి ప్రచారo లో, పాఠశాల కరపత్రాలను పంపిణీ చేస్తూ తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తు న్న విద్యా అవకాశాలు, సౌకర్యాలపై అవగాహన కల్పించారు.

విద్యార్థుల కోసం ప్రభు త్వం కల్పిస్తున్న వివిధ వసతులు,సదుపాయాలను సద్వినియోగం చేసుకునేందుకు  తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ కౌన్సిలర్ వాసా జ్యోతి, లయన్స్ క్లబ్ సభ్యులు చిత్రం.విశ్వనాధ్, ఉ పాధ్యాయులు సైదులు, జానకి, రాములు, నరసింహారావు, జానయ్య, శ్రీధర్, లాల్ సాహెబ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.