16 April, 2026 | 2:24 AM

మహిళా పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలి

16-04-2026 12:43 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తగిన ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సెర్చ్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సెర్చ్ సిబ్బందికి నిర్వహించిన ఉద్యమి ఆధార్ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండలాల్లో మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేస్తున్న చిన్న తరహా వ్యాపారాలకు సంబందించిన ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్యం మహిళా సంఘాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు తగిన విధంగా ప్రతి మండలంలో 10 నూతన వ్యాపారులను గుర్తించి జూన్ 2 వరకు గ్రౌండింగ్ చేయించాలని సూచించారు.

ప్పటి వరకు ఏర్పాటు చేసిన వ్యాపారాలకు సంబందించి ఉద్యమి ఆధార్ సర్టిఫికెట్ అందించాలని సూచించారు. మహిళా సంఘ సభ్యులు చేస్తున్న కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు సంపూర్ణంగా లబిస్తుందన్నారు. ఉద్యమి ఆధార్ సర్టిఫికెట్ పొందడం ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంక్ ల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉందన్నారు.

ఉద్యమి ఆధార్ సర్టిఫికెట్ ద్వారా ప్రభుత్వ సహకారంతో పాటు ప్రభుత్వ టెండర్ లలో పాల్గొనే అవకాశం లబిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్దివో శిరీష, జిల్లా పరిశ్రమల అధికారి ప్రవీణ్ కుమార్, శోభారాణి, డీఆర్డిఏ అదనపు సంచాలకులు సురేష్ ట్రైనర్ రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.