19-12-2025 04:38:24 PM
భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): ఏపీఎస్ఆర్టీసీ కార్గో పార్సెల్ సర్వీస్(APSRTC Cargo Parcel Service)లో డోర్ డెలివరీ మాసోత్సవాలు ఈనెల 20వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాల్వంచ ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ఏజెంట్ యడ్లపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 84 పట్టణాలలో 50 కేజీల వరకు బరువైన వస్తువులను పది కిలోమీటర్ల దూరం వరకు డోర్ డెలివరీ సౌకర్యం కల్పించబడిందనీ ,క్రిస్మస్ జనవరి 1 సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు.