calender_icon.png 19 December, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు

19-12-2025 04:35:36 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల మండలం భవిత కేంద్రంలో మండల విద్యాధికారి విఎస్వి మాలవీదేవి సమక్షంలో శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగ విద్యార్థులు పట్టుదలతో చదివి ప్రయోజలు తయారు కావాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సెక్టోరియల్ అధికారి చౌదరి, ఐఏఆర్పిలు సృజన, శ్రీలత, మండలంలోని దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.