16 July, 2026 | 8:48 AM

సీనియర్‌ సిటిజన్లకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్

15-11-2024 01:46 PM

అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ శుక్రవారం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సీనియర్‌ సిటిజన్లకు ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ శుభవార్త చెప్పింది. అన్ని రకాల బస్సుల్లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు 25 శాతం రాయితీని ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) పొడిగించింది.ఏపీ వారికే కాదు.. ఏ రాష్ట్ర సీనియర్ సిటిజన్ కైనా.. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని చెప్పింది. నివాస స్థలంలో సంబంధం లేకుండా రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. 6 రకాలు గుర్తింపు కార్డులతో ఏ ఒక్కటి చూపించినా ప్రయాణికులకు రాయితీ వర్తిస్తుంది. టికెట్స్ కొనుగోలు సమయంలో సీనియర్ సిటిజన్ల నుంచి భౌతిక రూపంలో లేదా డిజిటల్ రూపంలో ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డులను వయస్సు రుజువుగా అంగీకరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేయబడ్డాయి.