18 April, 2026 | 11:59 AM

జలాశయాలకు జలకళ

26-09-2024 01:45 AM

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): వరుసగా కురుస్తున్న వర్షాలకు ఉస్మాన్‌సాగర్(గండిపేట్) రిజర్వాయర్‌లోకి భారీ స్థాయిలో వరద నీరు చేరింది. అలాగే హిమాయత్ సాగర్‌కూ వరద పోటు తగిలింది. దీంతో రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి. ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరగా, అధికారులు బుధవారం రెండు గేట్లను ఎత్తి దిగువకు 234క్యూసెక్కుల నీటిని వదిలారు. హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరలో ఉంది. అధికారులు ఒక గేటు ఎత్తి 348 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.