ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఏఆర్ కానిస్టేబుల్ మృతి
15-07-2026 09:23 AM
గజ్వేల్, (విజయ క్రాంతి): రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. మంగళవారం రాత్రి సుమారు 9.30 గంటలకు ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న టీఎస్ 08 జేవీ 4810 వ్యాగనర్ కారు, పాతూరు రింగ్‌రోడ్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత పంక్చర్ షాప్ వద్ద ఆగి ఉన్న టీఎస్ 30 టీఏ 3579 లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఆరె కిరణ్, సిద్దిపేట ఏఆర్ కానిస్టేబుల్ (బకిల్ నెం.236), ప్రస్తుతం హైదరాబాద్ ఐఎస్‌డబ్ల్యూలో విధులు నిర్వహిస్తున్న ఆయన, తీవ్ర గాయాలతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






