4 September, 2026 | 6:01 AM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోత తీవ్రం.. 38.4°C ఉష్ణోగ్రత నమోదు, వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు

15-07-2026 | 09:27am
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోత రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. జూలై నెలలోనూ సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్షాలు కురవకపోవడంతో వరి నారుమళ్ల ఎండిపోతుండగా, వ్యవసాయంపై ఆధారపడిన రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోత.. 38.4°C నమోదు

బోధన్,జూలై15(విజయక్రాంతి): గడిచిన 24 గంటల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో(Nizamabad district) ఉష్ణోగ్రతల పెరిగి ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. రాత్రివేళల్లో సైతం వేసవి కాలాన్ని తలపించింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా పోతంగల్ లో 38.4°C, కామారెడ్డి జిల్లా కొల్లూరు 38.2°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 34°C నుంచి 38 °Cల మధ్య నమోదయ్యాయి. కాగా ఆకాశం నిర్మానుష్యంగా మారి వర్షాభావ పరిస్థితితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

జూలైలోనూ తగ్గని ఎండలు.. రాత్రిపూట కూడా ఉక్కపోత

జిల్లాలో వాతావరణం

రోజు రోజుకూ వేడెక్కుతోంది. తీవ్రమైన ఎండవేడిమి, ఉక్కపోత, చెమటలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జూలై రెండో వారం దాటినప్పటికీ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం గమనార్హం రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసిన వరి నాట్లు బీటలు పాడుతున్నాయి. ఒకవైపు వరినారు మల్లు లో ఎండిపోతున్నాయి, ఇదే పరిస్థితి ఇంకా రెండు వారాలు ఇలాగేఉంటే రైతుల పరిస్థితి ఆందోళన చదువుతారు.

వర్షాభావంతో రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోత ప్రభావం వ్యవసాయంపై స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు వేసిన వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి.

చాలా ప్రాంతాల్లో సాగు పనులు నిలిచిపోగా, ఇప్పటికే నాటిన పంటలు కూడా నీటి కొరతతో ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాల కోసం ఎదురుచూస్తున్న జిల్లా

ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు ఇప్పుడు పూర్తిగా వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు. త్వరలో విస్తారంగా వర్షాలు కురిస్తేనే పంటలు గాడిలో పడే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు

పోతంగల్ (నిజామాబాద్) – 38.4°C

కొల్లూరు (కామారెడ్డి) – 38.2°C

ఇతర ప్రాంతాలు – 34°C నుంచి 38°C

సాధారణం కంటే 2-3°C అధిక ఉష్ణోగ్రతలు

వర్షాభావంతో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి.

REALTED ARTICLES....

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోతే..!

సాగు సంకటమే!