15 July, 2026 | 9:29 AM

రోడ్డు భద్రత పై అవగాహన సదస్సు

15-07-2026 09:20 AM

గరిడేపల్లి, జూలై 14,(విజయ క్రాంతి): ప్రతి ఒక్కరూ రోడ్డు రవాణా నిబంధనలను పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని గరిడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లి లోని కల్మలచెరువు ఎక్స్ రోడ్డు వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతపై మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు నిర్దేశిత వేగా పరిమితిని దాటవద్దని సూచించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కోరారు. వాహన నడిపేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడటం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రమాదాల రహిత సమాజ స్థాపనలో వాహనదారుల పాత్ర కీలకమైన పేర్కొన్నారు. వాహనదారులందరూ రోడ్డు భద్రత రవాణా నియమాలను తప్పనిసరిగా పాటించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో గరిడేపల్లి పోలీస్ సిబ్బంది స్థానిక వాహనదారులు ప్రజలు పాల్గొన్నారు.