15 July, 2026 | 9:29 AM

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకుల నిరసన

15-07-2026 09:17 AM

కేసు నమోదు చేయాలని ఎస్సై లచ్చిరెడ్డికి ఫిర్యాదు పత్రం అందజేస్తున్న బిఆర్ఎస్ నాయకులు

మోతె, జులై 15 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ, వెంటనే ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలని మోతె మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోతె పోలీస్ స్టేషన్‌లో ఎస్సై లచ్చిరెడ్డి కి ఫిర్యాదు అందజేశారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండక, సూపర్ ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు దిక్కుతోచక అగమ్యగోచరంగా ఉంటే, ముఖ్యమంత్రి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బహిరంగంగా ఈ కరువు సమస్య తీరాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మొత్తం కేసీఆర్ కుటుంబ సభ్యులు, యావత్ తెలంగాణ రైతుల రక్తాన్ని తెలంగాణ రైతుల పొలాల్లో చల్లాలి' అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

అంతేగాక ఈ ప్రతిపక్ష నాయకులు తమ ఒంటికి బండరాయి కట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో దూకి చావాలి అని అనడం ఆయన అధికార దురంకారానికి పరాకాష్ట అని విమర్శించారు.ఇలాంటి తీవ్ర పదజాలం వాడిన సీఎం రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరే లింగారెడ్డి,నాయకులు బానోతు దేవుల నాయక్, భూక్య గాంధీ, బాబు, శ్రీను, లింగయ్య, వెంకటేశ్వర్లు, నవీన్, నరేష్, సుధాకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.