calender_icon.png 14 November, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

37 ప్రీమియంతో ఆర్కడే డెవలపర్స్ లిస్టింగ్

25-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: గతవారం ఐపీవోకు వచ్చిన ఆర్కడే డెవలపర్స్ మంగళవారం 37 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఈ షేరు ఆఫర్ ధర రూ.128 ధరతో పోలిస్తే బీఎస్‌ఈలో 37.4 శాతం అధికంగా రూ.175.90 వద్ద ట్రేడింగ్ ఆరంభమయ్యింది. ఇంట్రాడేలో ఇది రూ.190 గరిష్ఠస్థాయికి చేరిన అనంతరం చివరకు రూ.165.85 వద్ద ముగిసింది.

ఇష్యూ ధరకంటే ఇది 29.5 శాతం అధికం. ఎన్‌ఎస్‌ఈలో కూడా దాదాపు ఇదే ట్రెండ్‌ను కనపర్చింది. ఆర్కడే డెవలపర్స్ ఐపీవో 106 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఈ కంపెనీ ముంబై ప్రధాన కేంద్రంగా రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.