17 April, 2026 | 5:37 PM

తెల్లజొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి

17-04-2026 04:28 PM

బోథ్,(విజయక్రాంతి): నియోజకవర్గంలో మొక్కజొన్న తెల్లజున్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం మార్క్ఫెడ్ ఎండి శ్రీనివాసరెడ్డిని బోత్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి చొరవతో ఆడే గజేందర్ సహకారంతో జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు.

త్వరలోనే పంట కొనుగోలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం జరుగుతుందని వారి వివరించారన్నారు. మార్క్ఫెడ్ ఎండి కలిసిన వారిలో బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ మాజీ ఎంపీటీసీ సహకార సంఘం డైరెక్టర్ సట్ల ఉమేష్ కాంగ్రెస్ పార్టీ మాజీ బ్లాక్ అద్యక్షులు మెరుగు నరసింహ దాస్ యువ నాయకులు ఆలపాటి అచ్యుతానంద రెడ్డి లో ఉన్నారు ప్రభుత్వం కొనుగోలు ప్రారంభిస్తే రైతులకు న్యాయం చేసి ఉన్నట్లు అవుతుందని వారు పేర్కొన్నారు.