5 August, 2026 | 10:42 AM

పదవులేనా? ప్రజా సంక్షేమం వద్దా!

16-06-2024 01:15 AM
  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తీరుపై బీజేపీ నాయకురాలు శ్రావణి ఫైర్

జగిత్యాల, జూన్ 15 (విజయక్రాంతి): మీకు పదవులేనా? ప్రజా సంక్షేమం వద్దా అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రశ్నించారు. జగిత్యాలలో శనివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థాయిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తారా? అని ప్రశ్నించారు. నియోజకవర్గానికి ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు? ఎందరికి ఉపాధి కల్పించారన్నారు. నియోజకవర్గంలో 4,520 మందికి మంజూరైన డబుల్ బె డ్రూం ఇళ్లను మంజూరు చేయకుండా తమ వర్గానికే  మేలు చేస్తున్నారని ఆరోపించారు.  జగిత్యాలలో అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభివృద్ధిపై ఎందుకు శ్రద్ధ చూపడంలేదని నిలదీశారు. సమావేశంలో రూరల్ మండలాధ్యక్షుడు తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదరిలు ఆము ద రాజు, సిరికొండ రాజన్న పాల్గొన్నారు.