10 June, 2026 | 4:29 PM

Breaking News

నాగోబాకు శిక్షణ ఐఏఎస్ అధికారుల పూజలు   •   మీనాక్షి నటరాజన్ వివాదంపై స్పందించిన బీఎల్ సంతోష్   •   నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •  

భారీ క్రేన్ ప్రారంభించిన ఏరియా జియం..

03-02-2025 06:44 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఏరియా జిఎం దుర్గం రామచందర్ సోమవారం రూ 1.74 కోట్ల విలువగల టిఐఎల్ కంపెనీకి చెందిన భారీ క్రేన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ క్రేన్ ను మణుగూరు ఓసికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రేన్ ద్వారా మణుగూరు ఓసి మరింత శక్తివంతమైనదిగా మారిందన్నారు. యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని తద్వారా మణుగూరు ఏరియాకు యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 126.7 లక్షల టన్నులను సాధించాలన్నారు. కార్యక్రమంలో డీజీఎం సివిల్ వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస చారి, అధికారులు రామారావు తదితరులు పాల్గొన్నారు.