calender_icon.png 10 July, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరికో కేఫ్ ఆరోపణలు అవాస్తవం

16-09-2024 12:04:42 AM

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): ఎక్సైజ్ శాఖపై ఆరికో కేఫ్ యాజమాన్యం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ.కమలాసన్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని అరికో కేఫ్‌లో విస్కీతో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌ను అమ్ముతున్నారని నిర్ధారించుకున్నాకే అధికారులు ఈనెల 5న ఆ షాప్‌పై దాడిచేశారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటన జరిగిన వారం తర్వాత ఆరికో కేఫ్ యాజమాన్యం ఎక్సైజ్ అధికారులు దాడుల సమయంలో డబ్బులు అడిగినట్లు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈటరీస్ వ్యాపారం చేస్తున్న కేఫ్‌లోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయన్నారు. అవాస్తవ, అనైతిక ఆరోపణలను ఎక్సైజ్ శాఖ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు.