18 August, 2026 | 3:53 AM

ఇక నిత్యకల్యాణం.. పచ్చతోరణం!

24-05-2024 01:06 AM

యాదాద్రిలో ప్రారంభమైన ఆర్జిత సేవలు

జయంత్యుత్సవాలతో మూడు రోజులు బంద్

యాదాద్రి భువనగిరి,మే23 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో  స్వామివారి ఆర్జిత సేవలు గురువారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నెల20 నుంచి 22 వరకు నృసింహ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఆర్జిత సేవలను నిలిపివేశారు. బుధవారం రాత్రి మహానివేదనతో ఉత్సవాలు పరిసమాప్తి కావడంతో గురువారం నుంచి ఆర్జిత సేవలను ఆరంభించారు. గురువారం రూ.49.౧౧ లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు ప్రకటించారు. 

 యాదాద్రి భక్తులకు ఆన్‌లైన్ సేవలు

స్వామి దర్శనం, ఇతర పూజల కోసం ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించారు. గురువారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావు, ఏఈవో జీ శ్రవణ్‌కుమార్ ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. బుకింగ్ కోసం  yadadritemple.telan gana.gov.inను సంప్రదించాలని సూచించారు. అలాగే కొండపై ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఈవో వెల్లడించారు.