26 April, 2026 | 10:47 AM

ఆర్మీ జవాన్ ఆత్మహత్య

26-06-2024 01:48 AM

పరిగి, జూన్ 25, (విజయక్రాంతి) : ఓ యువతి విషయంలో తీవ్ర మనస్థాపానికి గురై ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వేళ్తే.. వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చింటు (21) ఏడు నెలల కింద అగ్నిపథ్ (ఇండియన్ ఆర్మీలో) సెలక్ట్ అయి బెంగళూరులో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సెలవులు ఇవ్వడంతో ఈ నెల 22న ఇంటికి వచ్చాడు. సోమవారం సాయంత్రం ఓ యువతిని చింటు, అతని స్నేహితుడు శ్రీకాంత్ బైక్‌పై వెంబడించారు. ఈ విషయం తెలిసిన యువతి తండ్రి చింటును మందలించాడు. ఊర్లో అందరికి తెలిస్తే పరువు పోతుందని భావించి తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.