సంపులో పడి బాలుడు మృతి
26-06-2024 01:47 AM
చార్మినార్, జూన్ 25 (విజయక్రాంతి) : ప్రమాదవశాత్తు సంపులో పడి ఓ రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ నూరీనగర్‌కు చెందిన షాజహాన్ కుమారుడు రహీం (2) సోమవారం ఆడుకుంటూ పక్కింట్లో ఉన్న సంపులో పడిపోయాడు. కొద్ది సేపటికి పక్కింటి మహిళ వచ్చి చూడగా సంపులో బాలుడు మిగితాజీవిగా కనిపించాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






