20 May, 2026 | 2:46 AM

తాగునీటి కొరతకు ట్యాంకర్లు ఏర్పాట్లు చేయండి

20-05-2026 12:26 AM

నాగర్కర్నూల్, మే 19 ( విజయక్రాంతి )జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డుకు నిరంతరాయం గా సురక్షిత తాగునీరు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. మంగళవారం మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

వేసవి తీవ్రత దృష్ట్యా ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. పైప్లైన్ లీకేజీలు, మోటార్ల పనితీరు, నిల్వ ట్యాంకుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.బిజినపల్లి, కోడేరు, వెల్దండ, కొల్లాపూర్ మండలాల్లో నీటి కొరత నివారణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీరు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.