కవిత పార్టీ ప్రకటన సభకు ఏర్పాట్లు
- ముస్తాబైన ప్రొ.జయశంకర్ సార్ ప్రాంగణం
- గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించి మునీరాబాద్ బయల్దేరనున్న కవిత
- నేటి ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ (ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం) తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యా యం లిఖించడానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సంస్కృ తిక విప్లవానికి ఊతకర్రగా నిలుస్తూ తెలంగాణ జాగృతిని స్థాపించిన కల్వకుంట్ల కవిత 20 ఏళ్ల తన ప్రజా జీవితంలో ఎన్నో మైలు రాళ్లను చేరుకున్నారు. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం స్వీయ రాజకీయ శక్తికి శనివారం కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తు న్నారు. మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌తోపాటు దానిని ఆనుకునే ఉన్న 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సభాప్రాంగణం నుంచి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు.
సభ ప్రత్యేకతలు
* సభ ప్రాంగణం పేరు : ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభాప్రాంగణం
* ప్రధాన ద్వారం: ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ద్వారం
* ఇతర ద్వారాల పేర్లు: రాణి రుద్రమ దేవి ద్వారం, మారోజు వీరన్న ద్వారం, చాకలి ఐలమ్మ ద్వారం
భోజనశాలల పేర్లు
* సురవరం ప్రతాపరెడ్డి భోజనశాల
* సమ్మక్క సారలమ్మ భోజనశాల
* షోయబుల్లాఖాన్(మీడియా)భోజనశాల
తెలంగాణ వంటకాలు
నూతన పార్టీ ప్రకటన అనంతరం పార్టీ కార్యకర్తలు, అతిథులకు తెలంగాణ రుచులతో భోజనాలు వడ్డించనున్నారు.34 రకా ల వంటకాలను సిద్ధం చేశారు.
* ఉదయం 7.30 గంటలకు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీ గా అమరవీరుల స్తూపానికి బయల్దేరుతారు
* ఉదయం 8.15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు
* ఉదయం 8.25 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నుంచి బయల్దేరుతారు
* ఉదయం 9.30 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుంటారు
* ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను కల్వకుంట్ల కవిత ఆవిష్కరిస్తారు






