29 June, 2026 | 1:10 AM

పకడ్బందీగా ‘మొహర్రం’ ఏర్పాట్లు

29-06-2024 01:52 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28(విజయక్రాంతి): మొహర్రానికి  రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం ఆయన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్‌అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, షియా పెద్దలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. అశుర్‌ఖానాల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. సమీక్షలో ఎమ్మెల్సీలు మీర్జా రియజ్ ఉల్ హసన్ ఎఫెండీ, మీర్జా రెహమత్ బేగ్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్‌మెరాజ్, కౌసర్ మొహియుద్దీన్, మీర్ జుల్ఫెకర్‌అలీ పాల్గొన్నారు.