పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...
నిర్మల్ (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నిర్వహాణకు ప్రతిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు రాజకీయ పార్టీ నేతలతో ఎన్నికల నిర్వహాణపై సమావేశం నిర్వహించారు. జిల్లా మొత్తం 400 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించేందకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నట్టు తెలిపారు. 3368 వార్డులు, 3368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో మొత్తం 4,46,219 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ పేర్కోన్నారు. ఓటర్ల జాబితాలను ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రచురితం చేశామని అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. అనతరం జిల్లా కేంద్రంలోని ఈవీయం గోదాంలను పరిశీలన చేశారు. గోదాంల వద్ద బందోబస్తు ఏర్పాటుపై అడిగి తెలుసుకొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ డిపివో శ్రీనివాస్, అధికారులు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.






