8 May, 2026 | 9:49 AM

కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనం సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు

10-12-2024 10:23 PM

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల కాంగ్రెస్ పార్టీపై తిరగబడే రోజులు దగ్గరలోనీ కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అసలైన తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం గాని తప్పుడు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ మండల కమిటీల నాయకులు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.