రథయాత్రకు ఏర్పాట్లు పూర్తి
బోధన్,జులై15(విజయ క్రాంతి): జగన్నాధ రధయాత్ర కు బోధన్ పట్టణంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇస్కాన్ కార్యాలయంలో మంగళవారం రోజున రత్నమై రాధిక ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 19వ తేదిన ఈ రధయాత్ర24 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.
సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పూరీలో జరిగే విధంగా రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యంత భక్తి తో నిర్వహించే ఈ కార్యక్రమానికి పదివేల మంది వరకు భక్తులు హాజరవుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హజరవుతున్నట్లు వివరించారు. ఈ విలేకరుసమావేశం లో శ్రీమాన్ అశోకాత్మ నితాయదాస్ కేశులు కరుణానిధి దాస్ నిత్యరుంప నరహరిదాస్ కరణానాథ్ కృష్ణ దాస్ శివరామ్ ప్రభూడి చల్లా నాగేశ్వరావు ప్రభుంది. గోవిందే దాస్ ప్రభూ పాల్గొన్నారు.






