calender_icon.png 8 February, 2026 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్, కౌంటింగ్ కు సర్వం సిద్ధం

08-02-2026 07:09:15 PM

  • కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రోజు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఎస్ ఆర్ ఆర్ కళాశాలను సందర్శించారు. నగరపాలక సంస్థ అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి ఎన్నికల సామాగ్రీ పంపిణీ చేసే సెంటర్ తో పాటు బ్యాలెట్ బాక్సులు భద్రపరుచు గదులు, కౌంటింగ్ హాల్ ను తనిఖీ చేసి పరిశీలించారు. పోలీస్ భద్రత ఏర్పాట్ల నేపథ్యంలో పోలీస్ బంధోబస్తు నిర్వహణకు కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సీపీ గౌస్ ఆలం నిశితంగా పరిశీలించి, పోలీస్ అధికారులకు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

భారీ బంధోబస్తు ఏర్పాటు పై కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ తో సుదీర్ఘంగా చర్చించారు. మరో వైపు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరపాలక సంస్థ సంస్థ అధికారులతో కలిసి నగరంలోని పోలింగ్ స్టేషన్ ను సందర్శించి పోలింగ్ ప్రక్రియకు ఏర్పాటు చేసిన వసతులు సౌకర్యాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భారీ పోలింగ్ బంధోబస్తు మద్య పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. 11 వ తేదిన జరగబోయే పోలింగ్ కోసం 477 పోలింగ్ స్టేషన్లను గుర్తించి పోలింగ్ కు కావల్సిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామన్నారు.

ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా వసతి సౌకర్యాలు పూర్తి చేశామన్నారు. ఇందులో సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించామని సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలిస్ బధ్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ సహకారంతో పోలీస్ బధ్రత ఏర్పాటు చేసేలా చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. అంతే కాకుండా పోలింగ్ సామాగ్రీ పంపిణీ కి సర్వం సిద్దం చేశామన్నారు. పోలింగ్ సామాగ్రీని సిబ్బందికి పంపిణీ చేసేందుకు డివిజన్ వారిగా పోలింగ్ స్టేషన్ ప్రకారం కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద లైటింగ్ ఫర్నిచర్, త్రాగు నీటి వసతి, రవాణా కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు బ్యాలెట్ లెక్కింపు కోసం ట్రేలు, ర్యాకులు, టేబుల్స్ కూడ ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణం లో ముగించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ దిలీప్ కుమార్, ఏసిపి వెంకటరమణ, సిఐలు సృజన్ రెడ్డి, రాంచంధర్ రావు, తిరుమల్, నగరపాలక సంస్థ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.