28 April, 2026 | 2:21 AM

దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్

28-04-2026 12:06 AM
  1.  భారీగా బంగారం, వెండి రికవరీ 
  2.  విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు

జడ్చర్ల, ఏప్రిల్ 27: వరుసగా ఇండ్లలో చోరీలకు పాల్పడుతూ సొమ్ము చేసుకోవాల ని చూసిన ఇద్దరు నిధితులను అదుపులోకి తీసుకున్నట్లు డి.ఎస్.పి వెంకటేశ్వర్లు తెలిపా రు. జడ్చర్ల ఎస్.ఐ. కె. మల్లేష్ శుక్రవారం ఉ దయం జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో వా హన తనిఖీలు, నిఘా నిర్వహిస్తుండగా, అ నుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్య క్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పంచుల సమక్షంలో విచారించగా,వారు తా ము చేసిన వరుస దొంగతనాల గురించి నేరాన్ని అంగీకరించారు.

అబ్దుల్ మతీన్ అనే వ్యక్తి గతంలో ఐఐటి సంగారెడ్డిలో ట్రా నోస్పోర్ట్ సూపర్ వైజర్గా పనిచేసేవాడు.ఇతనిపై గతంలో హత్యాయత్నం, పోక్సో కేసులు ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఏర్పడిన అ ప్పులు తీర్చడానికి దొంగతనాలు మొదలుపెట్టాడు. దేవరశెట్టి శివకృష్ణ ఇతను వృత్తిరీత్యా డ్రైవర్. వ్యసనాలకు బానిసై అక్రమంగా డ బ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అబ్దుల్ మతీన్ తో చేతులు కలిపాడు. నిందితులిద్దరూ పగలు తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కీ నిర్వహించి, అర్ధరాత్రి సమయంలో తాళాలు విరగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని నగదు,నగలను దోచుకునేవారు. జడ్చర్ల మహబూబ్ నగర్ రోడ్డు పక్కన ఉన్న ఒక ఇంట్లో తాళం విరగొట్టి బంగారు కమ్మలు, చైన్, నగదు దొంగిలించారు.

మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైపాస్ సమీపంలో మరో ఇంట్లో 15 తులాల వెండి గొలుసులను దొంగిలించారు. జడ్చర్ల కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వెనుక వైపు ఉన్న ఇంట్లో బంగారు లాకెట్, కమ్మలు, చైన్, రెండు ఉంగరాలను దొంగిలించారు.సుమారు 50 గ్రాముల (5 తులాల) బంగారం (చైన్లు, కమ్మలు, లాకెట్, ఉంగరాలు). సుమారు 15 తులాల వెండి గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులను శుక్రవారం ఉదయం 8 గంటలకు జడ్చర్ల బస్టాండ్ సమీపంలో పట్టుకోవడం జరిగింది. నిందితుల నుండి రికవరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకొని,వారిని రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్.ఐ. మల్లేష్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.