28 April, 2026 | 2:16 AM

జనాభా లెక్కల గణనలో పాల్గొనండి

28-04-2026 12:06 AM

ఎంఎంసి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

సికింద్రాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): జనాభా లెక్క ల ప్రక్రియలో భాగంగా స్వీయ గణన ప్రక్రియను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. ఈ విధానం ద్వారా కుటుంబ సభ్యులు తమ ఇంటి వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకా శం కల్పించబడిందన్నారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ప్రజలు అధికారిక వ్బుసైట్ http://se.census.gov.in ద్వారా స్వీయ గణన పూర్తి చేసుకోవచ్చని సూచించారు.

ఇందుకోసం మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి, ఓటిపి ధృవీకరణ అనంతరం కుటుంబ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. నమోదు అనంత రం ఒక ప్రత్యేక నంబర్ జనరేట్ అవుతుందనీ తెలిపారు.ఈ ప్రత్యేక నంబర్ ను మన ఇంటికి వచ్చే జనగణన అధికారికి చూపించాలన్నారు. స్వీయ గణన ద్వారా సమయం ఆదా అవడంతో పాటు జనాభా లెక్కల ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగుతుందని తెలిపారు.

ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని, జనాభా లెక్కల స్వీయ గణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.ఈ స్వీయ జన గణనలో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. అలాగే ఉన్నతాధికారులు తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. ఎంఎంసిలోని ప్రతి అధికారి ఉద్యోగి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కమిషన్ ఆదేశాలు జారీ చేశారు.