యావన్‌ను చంపిన వారిని అరెస్టు చేయండి
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మృతుడి బంధువులు, మిత్రుల డిమాండ్
సికింద్రాబాద్‌లో యువతి ఇంటి వద్ద ఆందోళన
సికింద్రాబాద్, మే 8 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లో గురువారం అర్ధరాత్రి హత్యకు గురైన యావన్ అలియాస్ అఖిల్ బంధువులు, మిత్రులు శుక్రవారం అఖిల్ ప్రేయసి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. హత్యకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
యావన్(23) జవహర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమి స్తున్నాడు. యువతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా సీతాఫ ల్మండి ప్రాంతంలో ఉండే తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ తరచూ యువతిని కలుస్తున్నట్టు తెలిసింది.
దీంతో గురువారం అర్ధరా త్రి 3 ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు.. ఇంట్లో టీవీ చూస్తున్న యావన్‌పై దాడికి దిగారు. వారి నుండి తప్పిం చుకుని బయటికి వచ్చినా వదలకుండా నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. యా వన్ ఒంటిపై 17 చోట్ల కత్తులతో పొడిచారు. శుక్రవారం యావన్ బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో మేడిబావిలో ఉన్న నిందితుల ఇంటిని ముట్టడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు భారీగా అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హత్యకు బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తమ కుమారుడిని దారుణంగా హత్య చేసిన నిందితులను తమకు అప్పగించాలని యావన్ తండ్రి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మా బిడ్డ ప్రాణం తీసిన నిందితులు దర్జాగా ఇంట్లో ఏసీల్లో కూర్చున్నారు. బీటెక్ చదువుతున్న మా కుమారుడి ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అంటూ పోలీసులను ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.






