calender_icon.png 15 November, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమితలో కనువిందు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్

15-11-2025 12:57:05 AM

ముకరంపుర, నవంబరు 14 (విజయ క్రాంతి): నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో బాలల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన ఆర్ట్, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కనువిందు చేసింది. పారమిత విద్యాసంస్థ ల చైర్మన్ డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. 6 నుండి 10 వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులచే చిత్రించబడిన దాదాపు 700 కి పైగా కళాకృతులను ప్రదర్శించారు.

ఈ కళాకృతులలో ముఖ్యంగా మహిళా సాధికారత, ప్రకృతి, పర్యావరణం, వివిధ అంశాలపై వేసిన పెన్సిల్ స్కెచ్ లు, పెయింటింగ్ లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రష్మిత , వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, హన్మంత రావు , ప్రిన్సిపాల్ గోపికృష్ణ, సమన్వయ కర్తలు నాగరాజు, రాము, ఆర్ట్ టీచర్ అజింక్యా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులుపాల్గొన్నారు.