విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి
07-06-2026 10:41 AM
బోథ్(విజయక్రాంతి): సోనాల మండలంలోని సాకేర (సూర్య నగర్) గ్రామానికి చెందిన. ఆడే ధీరజ్ అనే బాలుడు ఆదివారం ఉదయం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. ఇంటిలో ఉన్న కూలర్ కు విద్యుత్ సరఫరా కావడంతో బాలుడు కూలర్ తగిలి మృతి చెందాడు. బాలుని మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ ప్రమాదానికి గురైన బాలుడిని వెంటనే బోత్ ఆసుపత్రికి తరలించగా బాలుడు అప్పటికే మరణించినట్లు తెలిసింది.






