22 August, 2026 | 2:52 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్‌లో కళాకారిణి ప్రతిభ

27-04-2026 07:57 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): తిరువనంతపురంలో అద్భుతంగా నిర్వహించిన 5వ అనంతపురి ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్‌లో మహబూబ్‌నగర్ కళాకారిణి ప్రతిభ చాటారు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం లోని భారత్ భవన్ లో నిర్వహించిన 5వ అనంతపురి ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్‌లో మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రముఖ నృత్య గురువు, Master in Performing Arts (Kuchipudi) మరియు B. Ed. కళాశాల అతిథి అధ్యాపాకురాలు జి. శాంతి మాస్టర్ పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు.

ఈ అంతర్జాతీయ వేదికపై వివిధ  రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొనగా, శాంతి మాస్టర్ కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సంప్రదాయ నృత్య శైలిని ఆధునిక అభినయంతో మేళవించి అందించిన ప్రదర్శనకు విశేష ప్రశంసలు లభించాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కళాకారిణి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచడం గర్వకారణమని స్థానికులు పేర్కొన్నారు. శాంతి మాస్టర్  ఈ విజయంతో జిల్లా కళాకారులకు మరింత ప్రోత్సాహం లభించనుంది.