31 August, 2026 | 2:18 AM

సమగ్రాంధ్ర సాహిత్య స్రష్ట ఆరుద్ర

31-08-2026 12:16 AM

నేడు ఆరుద్ర జయంతి :

తెలుగు సాహిత్య రంగం(Telugu literary sector)పై అయినా, సినీ రంగం(film industr)పై అయినా ఆరుద్ర వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. సాహిత్య ప్రక్రియ ఏదైనా దానిలో తనదైన మార్క్ సృష్టించడం ఆయనకు వెన్నెతోపెట్టిన విద్య. గేయమైనా, వచనమైనా ఆయనకు కొట్టిన పిండి. మార్క్సిజాన్ని, ఆధ్యాత్మితకను జోడు గుర్రాల్లా తన రచనల్లో, పాటల్లో ప్రతిబింబించిన అరుదైన సృష్ట ఆరుద్ర. మహాకవి శ్రీశ్రీకి ఈయన స్వయానా మేనల్లుడు. శ్రీశ్రీ కంటే ఈయన కేవలం ౧౪ ఏళ్లు చిన్న.

ఆరుద్ర 1925 ఆగస్టు ౩1న ఉత్తరాంధ్ర ప్రాంతంలో జన్మించాడు. అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. కానీ, ‘ఆరుద్ర’ అనే కలం పేరుతోనే వాసికెక్కారు. ఆయనపై శ్రీశ్రీ ప్రభావం అపారంగా ఉంది. ముఖ్యం గా ఆయనలో సాహిత్య రంగంపై అభిలాష కలగడానికి శ్రీశ్రీ ముఖ్యకారణం. అలాగే, నాటి దిగ్గజ కథకుడు చాగంటి సోమయాజులు పితృసమానుడు. సోమయాజులు వద్ద ఆరుద్ర మార్క్సిజాన్ని ఔపోశన పట్టాడు.

మరో రచయిత శెట్టి ఈశ్వరరావు నిర్దేశకత్వంలో కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడయ్యాడు. కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో చేరి కొన్నాళ్లు పనిచేశాడు. తర్వాత సాహిత్య రంగంలో బహుముఖ ప్రజ్ఞావంతుడయ్యాడు.

కవిగా, గేయకర్తగా, నాటకకర్త గా, నటుడిగా, నవలాకారుడిగా, కథకుడి, కాలమిస్టుగా ఎదిగాడు. ఆయన నాలుగైదు భాషలు నేర్చిన బహు భాషావేత్త. రచనలు చేస్తున్న క్రమంలోనే ఆయన మద్రాసు చేరుకున్నాడు. ‘ఆనందవాణి’ పత్రికలో కొలువుకు కుదిరాడు. తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగుతున్న ఆ సమయంలో ఆయన ‘త్వమేవహం’ అనే దీర్ఘ కావ్యం రాశారు.

సినీ రంగంలోకి ప్రవేశం

ఆరుద్రకు మొదట్లో సినీ పరిశ్రమపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. జర్నలిస్టుగా సినిమాలపై విమర్శనా వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో పరిచయమైన న్యాపతి నారాయణమూర్తి రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీకి ఆరుద్రను పరిచయం చేశాడు. అప్పుడే ఆ సంస్థ తీసిన ‘సౌదామని’ చిత్ర కథా రచన బృందంలో పని చేశాడు. అనంతరం ఆ చిత్ర సెట్‌లోనూ పనిచేసి, మన్ననలు పొందాడు.

కేవీ నాగభూషణం కంపెనీలో చేరి, ప్రప్రథమంగా ‘పరోపకా రం’ అనే చిత్రానికి మాటలందించాడు. ఆరుద్ర ఎనిమిది డిటెక్టివ్ నవలలు రాయగా, ‘పలకల వెండిగ్లాస్’ బహుళ ప్రాచుర్యం పొందింది. చెస్‌ను ఇష్టపడే ఆరుద్ర చదరంగం పేరుతో పుస్తకాన్ని రాశారు. ఆరుద్ర ఇంద్రజాలికుడు కూడా. అందుకే ఆయన ‘మహేంద్రజాలం’ పేరుతో పుస్తకాన్నీ రాశాడు. సిద్ధాంత రీత్యా నాస్తికుడైనప్పటికీ అనేక ఆధ్యాత్మిక పాటలు కూడా రాశాడు.

సినీ రంగంలోనూ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలకు పాటలు మాత్రమే కాకుండా ఆయన కథలు అందించేవాడు. సంభాషణలు రాసేవాడు. చక్కనైనా పాటలు అల్లేవాడు. ఆరుద్రకు 1955 ఏప్రిల్ మాసంలో రచయిత్రి, జర్నలిస్టు రామలక్ష్మితో వివాహమైంది. వీరి వివాహానికి సినీ దర్శకుడు, హెచ్‌ఎం రెడ్డి, కవి శ్రీశ్రీ పెండ్లి పెద్దలు. అప్పట్లోనే వారిది ఆదర్శ వివాహం.

వీరి పెండ్లికి అయిన ఖర్చు రూ.౬౦ మాత్రమే. ఆరుద్ర తర్వాత వరుసగా యశోదాకృష్ణ, బాలభారతం, గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, భక్త తుకారం, మహాకవి క్షేత్రయ్య, వీర కంకణం వంటి సూపర్‌హిట్ చిత్రాలకు కథ, సంభాషణలు అందించాడు. అలా 150 చిత్రాలకు పైగా కథ, మాటలు, పద్యాలు, 500 చిత్రాల్లో 4,000కి మించి పాటలు రాశాడు.

పాటల మాంత్రికుడిగా గుర్తింపు

సినీ కవిగా ఆరుద్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎంతటి క్లిష్టతరమైన సన్నివేశానికైనా నిమిషాల్లో పాట రాయగల దిట్ట అని ఆరుద్రకు పేరుంది. మహా మహా గేయ రచయితలు రోజుల పాటు రాసే పాటలను ఈయన ఆశువుగా రాస్తారని ప్రతీతి. అలా రాసిన పాటే ‘పవిత్రబంధం’ చిత్రలోని ‘గాంధీ పుట్టిన దేశమా ఇది?’ అనే పాట. ‘ఆరాధన’‘చిత్రంలోని ‘రాజులు ఎక్కు అంబారీపై అందరు ఎక్కు ట తప్పుకదా?‘ అనే మరో పాట.

‘అందాలరాముడు’ చిత్రంలో ‘ఎదగడానికెందుకురా.. తొందర’ అనే పాట దిగ్గజ దర్శకు డు బాపునకు ఇష్టమైన పాట. బాపున రమణ ద్వయానికి అత్యంత ఇష్టుడైన కవిగా ఆరుద్రకు పేరుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ వారి ఆస్థాన కవి అరుద్ర అని నాటి పెద్దలు చమత్కరించేవారు. బాపు రమణ ‘పెళ్లి పుస్తకం’ చిత్రంలో ఆరుద్ర రాసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే అజరామర గీతంగా నిలిచిపోయింది.

అలాగే, ‘సిపాయి చిన్నయ్య’లో ‘నాజన్మభూమి’, ‘చెంచులక్ష్మి’లో ‘పాల కడలిపై’, ‘ఉయ్యాల జంపాల’లో ‘కొండ గాలితిరిగింది’ వంటి పాటలు నాటి యువతను ఉర్రూత లూగించాయి. ఇక ‘రౌడీలకు రౌడీలు’ చిత్రంలో రాసిన ‘ఏస్కో గోలిసోడా’ పాటైతే ఎవర్‌గ్రీన్. నాటి కుర్రకారు మనసులను దోచిన పాటగా ఈ పాట నిలిచింది. 

తిరుగులేని సమగ్రాంధ్ర సాహిత్యం

ఆరుద్ర పాటల్లో అంత్య ప్రాసలు ఆణిముత్యాలని, పొదిగిన రత్నాలని, వజ్రాలని నాటి కవులు వేనోళ్ల కీర్తించేవారు. అందుకే సి.నారాయణరెడ్డి ‘ఇలియట్ ప్రభావంతో ప్రతీకలను వాడి తెలుగు కవితలో అపూ ర్వ సంవిధానానికి బాటలు వేశాడు ఆరుద్ర’ అని కీర్తించాడు. మరో దిగ్గజ రచయిత, సంపాదకుడు నండూరి రామ్మోహన్ రావు ఆరుద్ర గురించి ‘తెలుగు సాహిత్యంలో ఆరుద్ర వంటి వైవిధ్య రచనలు చేసిన రచ యితలు బహు అరుదు.

సాహిత్యం అర్ణవమైతే, ఆరు ద్ర మథించని లోతుల్లేవు, సాహిత్యం అంబరమైతే, ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు. అతడు పట్టి బంగారం చేయని సాహిత్య శాఖ లేదు. సాహిత్యరంగంలో అతడు పూయించని పువ్వుల్లేవు. కేవలం కవిత్వాన్నే తీసుకున్నా, అతడు చేసినన్ని ప్రయోగాలు, అంత అందంగా చేసినవారు ఆధునిక కవుల్లో మరొకరు లేరేమో? కవిత్వం కాక, కథలు, నవలలు, నాటకాలు, పత్రికా వ్యాసాలు, పరిశోధనలు, ఇలాగ అతని రచనా వ్యాసంగం బహుముఖంగా జరిగింది,, జరుగుతున్నది’ అని కీర్తించారు.

ఆరుద్ర అన్ని రచనలు, పాటలు, పద్యాల కంటే ఆయన సమగ్రాంధ్ర సాహిత్య గ్రంథాల రచనకు పూనుకోవడం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్ప పరిణామం. ఆ గ్రంథాల రచనకు ఆరుద్ర అహర్నిశలు నిద్రాహారాలు మానేశారు. రేయింబవళ్లు పరిశోధన, రాత ప్రక్రియలోనే నిమగ్నమై ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన ఆరో గ్యం క్షీణించింది.

అయినప్పటికీ, అనుకున్న సంకల్పాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆయన మూత్రపిండాల సంబంధిత సమస్యతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యా డు. 1998 సెప్టెంబర్ ౧౩న కన్నుమూశాడు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని సాహిత్యాభిలాషులు, భాషాభిమానులంతా ఆయన సాహిత్య సేవలను స్మరించుకోవాలి. ఆయన మిగిల్చిన ఆశయాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలి. 

తాళ్లపల్లి యాదగిరి గౌడ్

99497 89939

వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు