31 August, 2026 | 4:31 AM

నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

31-08-2026 02:15 AM

మహబూబ్‌నగర్, అర్బన్ ఆగస్టు 30 :  జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎస్పీ డి. జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ జె.పి.ఎన్.సి.ఈ.లోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి భద్రతా, మౌలిక వసతులు, ప్రవేశ విధానాన్ని పరిశీలించారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు మహబూబ్నగర్ బస్స్టాండ్, రైల్వే స్టేషన్లలో బైక్ హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సహాయం అందించాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నవీన్, డీఎస్పీ (ఎస్బీ) రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.