19 April, 2026 | 11:26 AM

ఐటీడీఏ గురుకులం ఆర్‌సీఓగా అరుణ కుమారి

02-05-2025 12:00 AM

భద్రాచలం, మే 1 (విజయక్రాంతి):  ఖమ్మం రీజియన్ గురుకులాల సమన్వయ అధికారి అరుణ కుమారి శుక్రవారం  ఐటీడీ ఏ గురుకులం ఆర్ సి ఓ గా  బాధ్యతలు చేపట్టనున్నట్లు  గురుకులం పరిపాలన అధికారి నరేందర్ గురువారం ఒక ప్రకటనలో  తెలిపారు.

ఐటీడీఏ కార్యాలయంలో గురుకులం ఆర్ సి ఓ గా పనిచేసిన నాగార్జున రావు మే డ్చల్ రంగారెడ్డికి బదిలీ అయ్యారని, 2024 జులై 22వ తేదీన గురుకులం ఆర్సిఓగా బాధ్యతలు చేపట్టి ఇప్పటివరకు ఆర్ సి ఓ గా పనిచేసిన నాగార్జున రావు గురుకులం సెక్రెటరీ సీతా లక్ష్మి ఉత్తర్వుల మేరకు మేడ్చల్ రంగారెడ్డికి బదిలీ కావడంతో ఆయన స్థా నంలో దమ్మపేట మండలం అంకంపాలెం గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అరుణ కుమారిని ఐటీడీఏ గురుకులం ఆర్సిఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఆమె శుక్రవారం నాడు విధులలో జాయిన్ అవుతున్నారని తెలిపారు.