02-05-2025 12:00:00 AM
ఊరువాడా రెపరెపలాడిన ఎర్రజెండాలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు
20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె
విజయవంతానికి పిలుపు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే1( విజయ క్రాంతి): మే డే వేడుకలను జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఆయా సంఘాల అధ్యక్షు లు కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాల యం వద్ద ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ జెండా ఆవిష్కరించ గా జనకాపూర్‌లో పిడిఎస్‌యు జిల్లా ప్రధా న కార్యదర్శి తిరుపతి, కీర్తిలో దుర్గం నిఖిల్, ఆర్టీసీ డిపో వద్ద దివాకర్, భవన నిర్మాణ సంఘం వద్ద బాలకిషన్, కాగజ్‌నగర్‌లో ముంజం శ్రీనివాస్‌తో పాటు వివిధ సంఘా ల నాయకులు మేడే వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. 1886లో చికాగో నగరంలో 8 గంటల పని సాధన కోసం తుపాకి గుండ్లకు ఎదురు తిరిగిన కార్మికు లపై ముష్కరుల తుపాకీ గుండ్లతో ఎంతో మంది కార్మికుల రక్తం ఎరులై పారిందని గుర్తు చేశారు. ఏరులై పారిన రక్తం నుండి మంచి ఎత్తిన జెండా ఎర్రజెండా అని గుర్తు చేశారు. అమరుల స్ఫూర్తితో అమరుల త్యాగంతో సాధించ కుల రక్షణ కోసం మే 20న నిర్వహించే దేశవ్యాప్త సర్వత్రిక సమ్మెను జయప్రదం చేసి కార్మికుల ఐక్యతను నిరూపించుకోవాలన్నారు.
వేతనాల చట్టాన్ని అమలు చేయాలి
బెల్లంపల్లి అర్బన్, మే 1: చికాగో అమరవీరుల పోరాట త్యాగాల పతాకం వాడవా డల రెపరెపలాడింది. మే డే అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవం పార్టీలు, రాజకీయాలు, యూనియన్‌లకు అతీతంగా అట్ట హాసంగా జరుపుకున్నారు. గనులు, డిపార్ట్మెంట్లు, కార్మిక, అసంఘటిత సంఘాల కార్యాలయాలపై ఎర్రజెండాలు రెపరెపలాడాయి. సింగరేణి గుర్తిం పు కార్మిక సంఘం ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు బెల్లంపల్లి భగత్‌సింగ్ చౌరస్తాలో ఎర్రజెండా ఎగరవేసి చికాగో వీరులకు జోహార్లు చెప్పారు. సీపీఐ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యదర్శి ఆడెపు రాజమౌళి జెండా ఆవిష్కరణ చేశారు. భగత్ సింగ్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి జెండా ఆవిష్కరణ చేసి మేడే వేడుకలను నిర్వహించారు.
ఏరియా హాస్పిటల్ వద్ద జెండా ఆవిష్కరణ చేసి మేడే దినోత్సవం జరిపారు. సీఐటీయూ, టీఎన్టియూసీ, సింగరేణి గని కార్మిక సంఘం, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు మేడే వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా ఉన్నప్పుడే తమ న్యాయమైన హక్కులను సాధించుకోవచ్చని అన్నా రు. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంకిత భావంతో పనిచేయాలని అప్పుడే కార్మికుల కు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సూరి బాబు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్ల య్య, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కన్వీనర్ నాతరి స్వామి, టిఎన్టిసి నాయకులు మనీ రామ్ సింగ్, ఎస్‌జికేఎస్ నాయకులు మహేందర్, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు నీరేటిరాజం, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు కనుకుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
సమరశీల పోరాటాలు చేయాలి..
లక్షెట్టిపేట, మే 1: పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తాలో కార్మికులతో కలిసి మే డే ఉత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వ హించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... చికా గో అమరుల రక్తంతో తడిసి ఎర్రజెండాగా అవతరించిందన్నారు. వారి పోరాట ఫలితం గా ప్రపంచమంతా ఎనిమిది గంటల పని విధానం అమల్లోకి వచ్చిందన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ 44 చట్టాలను నాలు గు కోడ్‌లుగా మారుస్తూ కార్మిక హక్కుల్ని హరిస్తుందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా సంగటితమై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రక్షించుకొనటానికి సమరశీల పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్ల క్రమబద్ధీకరణ కోసం ఉద్యమిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్ తదితర చట్టబద్ధత హక్కులను అమ లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో రెడ్డి మల్ల ప్రకాశం, కళ్యాణం రవి, సునీల్ పాల్గొన్నారు.
రెపరెపలాడిన అరుణ పతాకం
మందమర్రి, మే 1: చికాగో అమర వీరులను స్మరిస్తూ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను పట్టణంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కార్మిక సంఘాల కార్యా లయాలు ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. పట్టణంలోని ఏఐటీయుసీ కార్యాలయంలో ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సిఐటియు కార్యాలయం లో సిఐటియు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్ నాగరాజు గోపాల్, హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో హెచ్‌ఎమ్‌ఎస్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్, ఐఎన్టియుసి కార్యాలయంలో ఏరియా నాయకులు దేవి భూమయ్య ఎర్ర జండాలను ఆవిష్కరించి చికాగో అమర వీరులకు నివాళులర్పించారు. మేడే ను పురస్కరించు కొని పట్టణంలోని పలు ముఖ్య కూడళ్లలో ఎర్రజెండాలు ఆవిష్కరించారు. అంతేకాకుండా ఏరియాలోని సింగరేణి గను లు, డిపార్టుమెంట్‌లలో వివిధ కార్మిక సం ఘాల ఆధ్వర్యంలో ఎర్రజెండాలను ఆవిష్కరించి మేడే వేడుకలను ఘనంగా జరుపుతున్నారు.