calender_icon.png 2 May, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం జిల్లా క్రీడారంగానికి కొత్త శోభ

02-05-2025 12:00:00 AM

  1. ఖమ్మం పటేల్ స్టేడియంలో సింధటిక్ ట్రాక్

నేడు భూమి పూజ చేయనున్న మంత్రి తుమ్మల 

అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రాక్ నిర్మాణం

రూ. 8.50 కోట్లతో ట్రాక్ నిర్మాణానికి శ్రీకారం

క్రీడా సదుపాయాలు దిశగా తుమ్మల అడుగులు

జాతీయ అంతర్జాతీయ క్రీడలకు వేదిక కానున్న ఖమ్మం

ఖమ్మం యువత, క్రీడాకారుల్లో ఆనందోత్సాహాలు 

ఖమ్మం, మే 1 (విజయక్రాంతి): ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నూతన శోభను సంతరించుకొనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు చేతుల మీదుగా శుక్రవారం ఉదయం 8 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ 8.50 కోట్ల వ్యయంతో క్రీడాకారుల యువత కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఈ ట్రాక్ నిర్మాణా నికి అడుగులు పడ్డాయి.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ట్రాక్ నిర్మాణానికి కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్ కు వేదిక కానుంది. మౌలిక సదుపాయాల లక్ష్యంగా మంత్రి తుమ్మల అడుగులు..ఖమ్మం జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషి చేస్తున్నారు.

దీనిలో భాగంగా సర్దార్ పటేల్ స్టేడి యం తో పాటు మిగతా స్టేడియాలలో అన్ని మౌలిక వసతులు కల్పనకు చర్యలకు పూనుకున్నారు. ప్రప్రదమంగా ఖమ్మం జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలో అత్యాధునికంగులతో జాతీయ ప్రమాణాలతో ఈ సింథటిక్ ట్రాక్ నిర్మాణం చేస్తున్నారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. 

క్రీడాకారుల్లో ఆనందోత్సాహాలు...

ఖమ్మం జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ వల్ల క్రీడాకారులు మెరుగైన నైపుణ్యాలు మెలకువలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. యువత క్రీడాకారులకు  సింథటిక్ ట్రాక్ మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపయోగపడుతుంది. శిక్షణకు  వజ్రాయు ధం లాంటి ఈ ట్రాక్ లక్షలాదిమంది క్రీడాకారులను తయారు చేసేందుకు ఉపయో గపడుతుందని క్రీడాభిమానులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ అంతర్జాతీయ క్రీడలకు వేదిక ఉండే ఈ సింథటిక్ ట్రాక్ అరుదుగా కనిపిస్తుంది. ఖమ్మం నగరంలో దీనిని ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు క్రీడాభిమానులు కృతజ్ఞతలు అర్షద్వానాలు వ్యక్తం చేస్తున్నారు.

సింథటిక్ ట్రాక్ తో అద్భుత ప్రయోజనం

సింథటిక్ అథ్లెటిక్ నిర్మాణంతో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలకు వేదిక కానుంది. అథ్లెటిక్ శిక్షణ మరియు పోటీకి మన్నికైన, స్థిరమైన మరియు సురక్షితమైన ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. ఇది వేగవంతమైన సమయాలకు, గాయాల ప్రమాదాల ను తగ్గిస్తుంది.  సింథటిక్ ట్రాక్లు అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి, కనీస నిర్వహణ అవసరం మరియు వివిధ అథ్లెటిక్ కార్యకలాపాల కోసం రూపొందించబ డతాయి.

సహజమైన అథ్లెటిక్ ట్రాక్తో పోలిస్తే, సింథెటిక్ అథ్లెటిక్ ట్రాక్‌ు అథ్లెట్ల కోసం మెరుగైన ఉపరితలాన్ని మరియు సౌకర్యాన్ని సింథటిక్ ట్రాక్ అందిస్తుంది.మట్టి ట్రాక్ లో ప్రాక్టీస్ చేసుకొని సింధటిక్ ట్రాక్ నందు పోటీలలో పాల్గొనినప్పుడు 1.5 to 2. సెకన్ల తేడాతో మెడల్స్ కోల్పోవటం జరుగుతుంది.

అందువలన సింథటిక్ ట్రాక్ నందు అథ్లెటిక్స్ ప్రాక్టీస్ తప్పనిసరి. మట్టి ట్రాక్ నందు ప్రాక్టీస్ చేసుకొని జాతీయ స్థాయి నందు నేరుగా పాల్గొనటం వలన ప్రిలిమినరీ నందు బాగా చేసి ఫైనల్స్ అప్పుడు చే యలేక పతకము కోల్పోవటం జరుగుతుం ది. అందువలన జిల్లా స్థాయి నుండి అథ్లెటిక్స్ యొక్క ప్రాక్టీస్ కొరకు సింథటిక్ ట్రాక్ తప్పనిసరి అయింది.

అంతే కాకుండా ముఖ్యమంత్రి కప్ 2024 లో జరిగిన క్రీడా పోటీలలో రాష్ట్ర స్థాయి లోనే అథ్లెటిక్స్ నందు మన సర్దార్ పటేల్ స్టేడియం నందు శిక్షణ తీసుకున్న క్రీడాకారులు  (12) బంగారు పతకాలు మన ఖమ్మం జిల్లా వాళ్ళు కావటం గమనార్హం. ఖమ్మం జిల్లా నుండి ఎక్కువ మంది అథ్లెటిక్స్ నందు జాతీయ స్థాయి , అంతర్జాతీయ స్థాయి లో పతకములు సాదించుటకు సింథటిక్ ట్రాక్ ద్వారా అనేక అవకాశాలు  మెరుగుపడతాయి..