3 August, 2026 | 3:05 PM

ప్రధాని ఇంటికి అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్ర

03-08-2026 02:34 PM

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన E20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ నివాసం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, 2,33,238 సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించడానికి 100 మంది మద్దతుదారులతో కలిసి AAP జాతీయ కన్వీనర్, మాజీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ ఇంటికి పాదయాత్రగా వెళ్లనున్నట్లు పార్టీ పేర్కొంది.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ... ఇథనాల్ విధానం ఎందుకు లోపభూయిష్టమైనదని తాను భావిస్తున్నాడో కూడా ఆయన చర్చించాలనుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం తాము ప్రధానమంత్రిని ఉద్దేశించి ఒక ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించామని, చాలా తక్కువ సమయంలోనే దాదాపు 2,33,238 మంది దానిపై సంతకాలు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వంద మందితో కలిసి ఆప్ కార్యాలయం నుండి ప్రధానమంత్రి నివాసానికి బయలుదేరుతానని కేజ్రీవాల్ తెలిపారు. తాము ఈ వినతిపత్రాన్ని ఆయనకు స్వయంగా అందజేసి, ఇథనాల్ విధానంలో ఉన్న లోపాల గురించి చర్చించాలనుకుంటున్నామని, అమెరికా ప్రెసిడెంట్ డ్రోనల్ ట్రంప్ ముందు కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని కేజ్రీవాల్ ఆరోపించారు.