3 August, 2026 | 2:59 PM

సుప్రీంలో జడ్జిల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

03-08-2026 02:24 PM

జడ్జిల సంఖ్య పెంపు బిల్లుపై లోక్ సభలో చర్చ

లోక్ సభ రేపు 11 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో జడ్జిల(Supreme Court judges) సంఖ్య పెంపు బిల్లుపై లోక్ సభలో చర్చ జరిగింది. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘావాల్(Union Minister Arjun Ram Meghwal) బిల్లుపై లోక్ సభలో మాట్లాడారు. బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు పదేపదే నినాదాలు చేశారు. కీలక సభ్యులు చర్చలో పాల్గొనాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు.  విపక్షాల నిరసనలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను (CJIతో కలిపి) 34 నుండి 38కి పెంచే బిల్లుకు లోక్‌సభ ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదదం తర్వాత స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.