ఈ చిన్నారిని ఆదుకోండి!
స్పునల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న ఆర్యన్
ఇంజక్షన్‌కు 16 కోట్లు అవసరం
దాతలు, ప్రభుత్వ సహాయం కోరుతున్న తల్లిదండ్రులు
ఘట్‌కేసర్, మార్చి 2 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన కాసుల ఆర్యన్ (23 నెలలు) స్పునల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ) టైప్-2 కండరాలకు సం బంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక మాదిరిగానే ఆర్యన్‌కు కూడా రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ చేయాలని వైద్యులు సూచించారు.
పేదలైన ఆర్యన్ తల్లిదండ్రులు కిరణ్, -నవీన.. దాతలు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కోరుతున్నారు. ఘట్‌కేసర్ డివిజన్ కెఎల్‌ఆర్ నగర్ లో నివా సం ఉంటున్న కాసుల కిరణ్, నవీన దంపతుల 23 నెలల కుమారుడు ఆర్యన్ ఎస్‌ఎం ఏ అరుదైన వ్యాధి సోకి వైద్యం చేయించడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఇప్పటికే ఆర్యన్ వైద్యానికి అప్పులు చేసి రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు.
చికిత్స అందించడానికి రూ.16 కోట్లు, రూ.9 కోట్లు, ట్రయల్ ఉన్న రూ.కోటి 50 లక్షలు విలువ చేసే ఇంజెక్షన్లలో ఏదో ఒకటి అవసరం. అందుకోసం తల్లిదండ్రులు.. దా తలు, ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం అందించి తమ బిడ్డను రక్షించాలని వేడుకుంటున్నారు. స్పందించి పలువురు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తున్నా అంత పెద్ద మొత్తం ఎలా సమకూర్చాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. మరికొందరు దాతలు మందుకు వచ్చి ఆర్యన్‌ను కా పాడేందుకు తమ వంతు విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమా చారం కోసం తమను 96668 83939 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.




